calender_icon.png 7 December, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్‌ పట్టేశారు

07-12-2025 12:00:00 AM

-విశాఖలో జరిగిన చివరి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం

-270 పరుగులకు సఫారీల ఆలౌట్

-39.5 ఓవర్లలోనే ఛేదించిన టీమ్‌ండియా 

-వన్డేల్లో తొలి సెంచరీ బాదిన యశస్వి జైశ్వాల్

సౌత్‌ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ 2 భారత్ కైవసం

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీ స్‌ను భారత్ 2 కైవసం చేసుకుంది. శనివారం విశాఖపట్నంలో జరిగిన ఆఖరి వన్డే లో 9 వికెట్ల తేడాతో మరో 10.1 ఓవర్లు మిగిలిఉండగానే లక్ష్యాన్ని ఛేదించి, ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా.. సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సఫారీలు 47.5 ఓవ ర్లలో 270 పరుగులకు ఆలౌటయ్యారు. ఈ లక్ష్యాన్ని టీమ్‌ండియా 39.5 ఓవర్లలోనే ఒకే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.

యశస్వి జైశ్వల్ 121 బంతుల్లో 116 పరుగులు చేసి వన్డేల్లో మొదటి సెంచరీ సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గానూ నిలిచాడు. రోహిత్ శర్మ 73 బంతుల్లో 75 పరుగులు చేశాడు. రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చి న కోహ్లీ 45 బంతుల్లో 65 పరుగులతో స్కో ర్‌ను పరుగులు పెట్టించాడు. దీంతో భారత జట్టు 2 తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది. రోహిత్, జైస్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్, కోహ్లి అభేద్యమైన రెండో వికెట్‌కు 84 బం తుల్లో 116 పరుగులు జోడించి భారత్‌కు ఘన విజయం అందించారు.

టాస్ ఓడి బ్యా టింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్ క్వింటన్ డి కాక్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ సిరీస్‌లో ఫామ్‌లో లేని డి కాక్ ఈ కీలక మ్యాలో 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బావుమా (48 పరుగులు) తో కలిసి డి కాక్ 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత బౌలింగ్ విభాగం అద్భు త ప్రదర్శన చేసింది.

ముఖ్యంగా పేసర్ ప్రసి ద్ధ్ కృష్ణ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రాణించి చెరో 4 వికెట్లు తీశారు. ప్రసిద్ధ్ తన 29వ ఓవర్‌లో మాథ్యూ బ్రీట్జ్‌కే (ఎల్‌బీడబ్ల్యూ), గత మ్యాచ్ సెంచరీ హీరో ఐడెన్ మార్కరమ్‌లను అవుట్ చేసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఆ తర్వాత డి కాక్ (106)ను కూడా అవుట్ చేసి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. స్పిన్నర్ కుల్దీప్ తన ఓవర్లలో డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సె న్, కార్బిన్ బోష్, లుంగీ ఎన్గిడిలను అవుట్ చేసి మిడిల్, లోయర్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.

స్కోరు బోర్డు

భారత్: యశస్వి జైస్వాల్ (116; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ శర్మ (75, 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (65 నాటౌ ట్, 6 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. 

సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (106, 8 ఫోర్లు, 6 సిక్సులు), తెంబా బావుమా (48, 5 ఫోర్లు), డెవాల్ బ్రెవిస్ (29), మాథ్యూ బ్రిట్కీ (24), కేశవ్ మహరాజ్ (20 నాటౌ ట్), మార్కో యాన్సెన్ (17) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ కృష్ణ 4, హరదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

యశస్వి తొలి సెంచరీ

విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డేలో యశస్వి జైశ్వాల్ తన కేరీర్‌లోనే వన్డే ఫార్మాట్‌లో తొలి శతకం బాదాడు. ఓపెనర్‌గా వ చ్చిన జైశ్వాల్.. 75 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. మరో 30 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచ రీ చేయడంతో మూడు ఫార్మాట్లలో శతకం చేసిన ఆరో భారత క్రికెటర్‌గా జైశ్వాల్ నిలిచాడు. సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రా హుల్, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ కూడా మూడు ఫార్మాట్లలో శతకాలు బాదారు. 

రోహిత్ శర్మ రికార్డు

సఫారీలతో మూడో వన్డే ద్వారా రోహిత్‌శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 20 వేల పరుగుల మైలు రాయిని పూర్తి చేసుకున్నాడు.