24 June, 2026 | 1:02 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

ఇంకుడు గుంతలు అవసరం!

05-02-2026 12:00 AM

రాష్ట్రంలో త్వరలో వేసవి కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భవిష్యత్తు కాలంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశముంది. ఇప్పటినుంచే ప్రతి నీటి బొట్టును చూసి వాడుకోవాల్సిన అవసరముంది. లేదంటే గతంలో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన నీటి ఎద్దడి ముప్పు మరోసారి ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా ఈ సంవత్సరం వర్షాలు, చల్లి, ఎక్కువగానే ఉన్నందున ఎండలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లా నినా ప్రభావమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

జీవరాసుల మనుగడకు నీరు చాలా అవసరం కావడంతో ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలి. అయితే గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంలో విఫలమైందని చెప్పవచు. అంతేకాదు అటవీ ప్రాంతంలోని కుంటలు, చెరువులను పునర్ నిర్మిచడంలోనూ ప్రభుత్వం ఆశించిన ఫలితం సాధించలేకపోయింది.

ప్రభుత్వ అధీనంలోని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. కాబట్టి వేసవి కాలం ప్రారంభానికి ముందే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి ప్రతీ నీటి చుక్కను ఒడిసి పట్టుకునేలా చర్యలు తీసుకోవాలి. భూగర్భ జలాలు అడుగంటకుండా నీటి పొదుపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజలకు అవగాహన కల్పించాలి.

 మిద్దె సురేష్, నాగర్ కర్నూలు