calender_icon.png 4 February, 2026 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపాయి క్షీణత ఎంతదాకా?

04-02-2026 12:00:00 AM

ఐ ప్రసాదరావు :

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవడాన్ని చూసుకుంటే మన దేశ ఆర్ధికాభివృద్ధిలో వాస్తవం ఎంత ఉందనేది ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. గత నెల 19వ తేదీన డాలర్ తో పోలిస్తే మన రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి పతనంతో మన పాలకులు చెబుతున్న ప్రపంచ ఆర్థిక శక్తి మాటలపై, దేశ జీడీపీ వృద్ధిపై అనుమానం కలగక మానదు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు తమ తమ వర్తకం, ఎగుమతులు, దిగుమతులు అమెరికా డాలర్ ప్రామాణికంగా జరుగుతుంది. అయితే మన రూపాయి విలువ కూడా అమెరికా డాలర్ తో ముడిపడి ఉన్న విషయాన్ని మరువకూడదు. 1947లో అమెరికా డాలర్‌తో మన రూపా యి విలువ 3.30గా ఉంది. 1977 నాటికి ఇది 8.33గా, 2007 నాటికి 43.95గా, ఇక మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2014 నాటికి డాలర్‌తో రూపాయి మార కం విలువ 58.66 ఉంది.

అయితే గత 12 సంవత్సరాల్లో ఇదే మోదీ పాలనలో అదే రూపాయి నేడు అమెరికా డాలర్‌తో పోలి స్తే 91.74 స్థాయికి దిగజారడం మన ఆర్థిక అభివృద్ధి విశ్వసనీయతపై సందేహాలు కలిగిస్తున్నది. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవ స్థలో నాలుగో శక్తిమంత దేశంగా ఉన్న భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే ఊహాగానాలున్నాయి. కా నీ రూపాయి ఎందుకు ఇంతలా పతనమవుతుంది, దీనిని ఎలా నివారించాలి అనే అంశంపై నిర్ధిష్టమైన చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.

నష్టాల్లో మార్కెట్‌లు..

గతేడాది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థి క మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రధాన వనరు మన స్టాక్ మా ర్కెట్లు అని చెబుతూ, ఎందరో విదేశీయు లు కొన్ని లక్షల కోట్ల రూపాయలు  మన స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. అయితే ఇటీవల కాలం లో స్టాక్ మార్కెట్లు మాత్రం రోజురోజుకు భారీ నష్టాలు చవిచూస్తూ వస్తున్నాయి.

ఈ ఏడాది జనవరి 19 నుంచి 23 మధ్య నా లుగు రోజుల్లో మదుపరుల సొమ్ము సు మారు 20 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయిపొయింది.. కొన్ని లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి. దాదాపు 85 వేల పైచిలుకు రాణించిన సెన్సెక్స్ సూ చీ, కేవలం కొద్ది రోజుల సమయంలో 3 వేల పాయింట్లు కోల్పోవడం గమనార్హం. దీంతో స్వదేశీ పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో నష్టాలు చవిచూశారు.

ఇంట్రాట్రేడ్‌లోనూ రూపాయి దా రుణ పతనం చవిచూసింది. దీంతో విదేశీయులకు కూడా భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లింది. పెట్టుబడులు ఉపసంహరణ చేసుకోవడం జరుగుతుంది. ఇ లాగే కొనసాగితే భవిష్యత్తులో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశముంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు, సెన్సెక్స్ సూచీలు ఆధారంగా దేశ ఆర్థికాభివృద్ధి అంచనా వేయకూడదు.

అంతర్జాతీయ పోకడలు..

అయితే మన రూపాయి పతనానికి అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామా లు కొంత కారణమని చెప్పొచ్చు. ముఖ్యం గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానా లు, గ్రీన్ లాండ్ వ్యవహారం మన దేశంలో స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూ పింది. ఇదే సమయంలో మన ఆర్థిక, రాజకీయ విధానాలు, వాస్తవాలు విశ్లేషణ చేసు కుని ముందుకు సాగాలి. మనం అమెరికా దిగుమతులుపై ఆధారపడి ఉండటం వల్ల, డాలర్‌తో మారకం చేయడం వల్ల రూపా యి విలువ ప్రభావం అవుతుందని గ్రహించాలి.

అదే విధంగా చమురు, బంగారం, వెండి, పామాయిల్ వంటివి ప్రతీ రోజూ భారీ ఎత్తున దిగుమతులు చేసుకోవడం వల్ల రూపాయి విలువ పతనం కావడమే గాక ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. మనకు కావలసిన ముడి చమురులో దాదాపు 85 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన రూ పాయి విలువ మరింత పతనం కాకుండా చూసుకోవాలి.

అందుకోసం దిగుమతులు కొంతమేర తగ్గించుకొని ఎగుమతులపై పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగాల ను దేశ ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా మలచాలి. స్వదేశీ ఉద్యోగ,  ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ యువ జనాభా కలిగిన భారత్‌లో నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఉత్పత్తి రంగంలో వారిని భాగస్వామ్యం చేయాల్సి న అవసరముంది.

ఓట్లు దండుకోవడం కోసం ప్రకటించే ఉచిత పథకాలకు చెక్ పెట్టి దాని స్థానంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా తలసరి ఆదాయం పెరగడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడుతుంది. అంతేకాదు దేశం నుంచి ఎగుమతులు పెరిగి డాలర్‌కు ధీటుగా రూపాయి నిలబడుతుంది. అప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ కాస్తా వికసిత్ భారత్‌గా రూపాంతరం చెందుతుంది.

వాస్తవాలు చూపెట్టాలి..

కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు బలహీనపడినప్పటికీ తాజా ఆర్థిక సర్వే ప్రకారం మన దేశ ఆర్థిక వ్యవస్థ కొం త మెరుగ్గానే ఉంది. దేశ జీడీపీ కూడా దా దాపు 7.2 శాతంగా ఉంది. ప్రస్తుతం డాల ర్ స్థిరత్వంలో ఉన్నప్పటికీ, రూపాయి విలువ పతనం వెనుక పాలకులు, ఆర్బీఐ, ఆర్థిక వేత్తలు సరైన విశ్లేషణ చేపట్టి నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఐఎమ్‌ఎఫ్ పే ర్కొంటున్న విషయాలపై దృష్టి సారించాలి. ఎప్పుడో దశాబ్ద కాలం నాటి సర్వే లు, ప్రామాణికంగా చేసుకొని నేటి గణాంకాలతో పోల్చరాదు.

ద్రవ్యోల్బణం, రిటైల్, టోకు ధరలు, వివిధ అంశాల రేట్లలో కొత్త సవరణలు చేపట్టి నేటి వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలి. త్వరలో 5 రాష్ట్రాల్లో అ సెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యం గా పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం పలు ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టే అవకాశముంది. నేటి పాలకులు గత సంవత్సరం కేంద్ర బడ్జెట్ లో ఆదాయం పన్ను తగ్గింపు ద్వారా ముఖ్యంగా ఢిల్లీ గద్దె ఎక్కడానికి, తదుపరి బీహార్‌లో అధికారం చేపట్టడానికి జీఎస్టీ మినహాయింపు గమ్మతులు చేయడం మనలో చాలా మందికి తెలిసిందే.

ఇలా అ ధికారం చేపట్టడానికి పలు రాయితీలు, పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా, పైపై మౌలిక సదుపాయాలు, కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా మాత్రం డాలర్ తో రూపాయి విలువ బలపడదన్న విషయం గ్రహించాలి. ఇలాంటి చర్యలతో జీడీపీ పెరిగినప్పటికీ, రూపాయి విలువ క్షీణత తప్పదు. దీనివల్ల సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధ్యపడదు.

విశ్వసనీయత అవసరం!

దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే మాత్రం దేశీయ ఉత్పత్తులు పెరగా లి. వలసలు అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరు గుపరచడంతో పాటు వ్యవసాయ, పారిశ్రామిక సేవా రంగాల్లో బడ్జెట్ కేటాయిం పులు పెంచాలి.  తలసరి ఆదాయం పెరగడం, జీవన ప్రమాణాలు మెరుగు పరచ డం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యం అవుతుంది.

భారత్‌లో వివిధ నగరాల్లో ము ఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో పెరుగుతున్న ‘వాయు కాలుష్యం’ నియంత్రణకు పాటుపడాలి. క్లీన్ ఎనర్జీపై దృష్టి సారించడంతో పాటు కల్తీలపై కన్నేర్ర చేయాలి. రోజు రోజుకు కొండెక్కుతున్న బంగారం, వెండి ధరలు అదుపు చేయడానికి, మూ డో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారాలన్నా, వికసిత భారత్ సాధ్యం కావాలన్నా ప్రపంచ స్థాయిలో రూపాయి విలువ బలంగా ఉండాలన్నా, అనుకున్న స్థాయి లో జీడీపీ శాతం పెరగాలన్నా ‘దిగుమతు లు తగ్గాలి..

ఎగుమతులు పెరగాలి’ అనే విషయం గుర్తుంచుకోవాలి.అప్పుడు మా త్రమే విదేశీ మారక ద్రవ్యం మనకు లభ్యం అవుతుంది. మన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిపై విశ్వసనీయత పెరగడంతో పాటు డాలర్‌తో ధీటుగా మన రూపాయి నిలబడేందుకు అవకాశముంటుందని గ్రహించా ల్సిన అవసరముంది.

 వ్యాసకర్త సెల్: 6305682733