24 August, 2026 | 9:50 PM

కొత్తగూడెం ఏరియాలో సామాజిక చైతన్య నాటక ప్రదర్శనలు

24-08-2026 07:56 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్  సహకారంతో, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో,కొత్తగూడెం ఏరియాలో రెండు రోజుల పాటు సామాజిక చైతన్య నాటికోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈనెల 25వ తేదీన  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం, ఆశయాల ఆధారంగా “సంఘం శరణం గచ్చామి” నాటకాన్ని, 26 తేదీన న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవితం, ఆశయాల ఆధారంగా “సత్యశోధన” నాటకాన్ని ప్రదర్శించనున్నారు.

ఈ రెండు నాటకాలు సాయంత్రం 6:30 గంటలకు కొత్తగూడెం గౌతంపూర్ కమ్యూనిటీ హాల్‌లో ప్రదర్శించబడనున్నాయి. సినిమా సెట్టింగ్‌లను తలపించే అద్భుతమైన వేదికా రూపకల్పన, ఆకట్టుకునే సన్నివేశాలు కళాకారుల ప్రతిభతో ఈ నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించే విధంగా ఘనంగా ప్రదర్శించబడనున్నాయి. సామాజిక సంస్కర్తల జీవితాలు, వారి ఆశయాలను ప్రజలకు పరిచయం చేసే ఈ నాటక ప్రదర్శనలకు సింగరేణి ఉద్యోగులు,  కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, కళాభిమానులు,యువత అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కొత్తగూడెం ఏరియా జీఎం శ్ సీ.హెచ్. వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు.