calender_icon.png 26 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌గాంధీతోనే సామాజిక న్యాయం

26-09-2025 12:00:00 AM

  1. బతుకమ్మ కుంటను కాపాడిన ఘనత సీఎం రేవంత్‌దే

పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు 

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే దేశ ప్రజలకు న్యాయం జరగుతుందని పీసీ సీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు అన్నారు. కుల గణన చేపట్టి జానాభా ప్రతిపాదికన రిజర్వేషన్ల అమలు చేస్తామన్న హామీ ఇచ్చారని, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు.

గురువారం ఆయన గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేత ఆర్. లక్ష్మణ్ యాదవ్‌తో కలిసి మీడియాతో మా ట్లాడుతూ అంబర్‌పేటలోని బతుకమ్మ కుం టను కాపాడిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు దక్కుతుందన్నారు.

బతుకమ్మ కుంటను మాజీ సీఎం కేసీఆర్ అనుచరుడే కబ్జా చేశారని, అందుకే కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. తాను బతుకమ్మ కుంటను కాపాడుకోవడానికి ఎంతో పోరాటం చేశానని, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి కుంటను కాపాడటంతోపాటు పునరుద్దరణ చేశారని వీహెచ్ తెలిపారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభిస్తారని, పార్టీలకు అతీతంగా రావాలని వీహెచ్ కోరారు.