26-09-2025 12:00:00 AM
ఎన్ డి డి బి సీనియర్ మేనేజర్ శ్రీధర్
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఇండియా మొదటి స్థానంలో ఉందని పాల ఉత్పత్తి మెరుగుకు అన్ని రాష్ట్రాలకు 450 కోట్లు కేటాయించి పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేస్తామని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ సీనియర్ మేనేజర్ వి శ్రీధర్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో ఎన్ డి డి వజ్రోత్సవ వేడుకలు పలు రాష్ట్రాల ప్రతినిధుల తో జరిగాయి.
ఈ సందర్భంగా సీనియర్ మేనేజర్ శ్రీధర్ ,తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్ పర్సన్ అమిత్ రెడ్డి, ముల్కనూర్ కో-ఆపరేటివ్ చైర్మన్ అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇండియాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ 450 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. 1966వ సంవత్సరంలో లాల్ బహుదూర్ శాస్త్రి ప్రథమంగా డైరీ ని గుజరాత్లో నెలకొల్పి దీన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో ’ఆపరేషన్ మిల్క్ ’కార్యక్రమం పేరిట పాల దిగుబడి పెంచేందుకు చర్యలు తీసుకున్నారని అన్నారు.
నేటి నుండి ఇండియాలో క్షీర విప్లవం అధిక దిగుబడులు సాధించేందుకు మూడు అంచెలుగా పశుగ్రాసం గడ్డి గింజలు మార్కెటింగ్ నాణ్యమైన పాలు వినియోగదారులకు అందించేందుకు తగిన చర్యలు తీసుకుందని అన్నారు. అలాగే కో-ఆపరేటివ్ సెక్టర్ డైరీ విభాగాలలో ఉన్నతంగా పనిచేసిన వారికి తగిన ప్రోత్సాహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వేలాది మంది మహిళలు ఏర్పాటు చేసుకున్న ముల్కనూర్ మహిళా డైరీలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డైరీలో జరిగిన సెమినార్లో గుజరాత్, ముంబై, ఢిల్లీ, రంగారెడ్డి, నల్గొండ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న నాబార్డ్ ప్రతినిధులు ముల్కనూర్ డైరీ జనరల్ మేనేజర్ మారుపాటి భాస్కర్ రెడ్డి, డైరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ ,పాల్గొన్నారు.