25-09-2025 11:55:56 PM
చైతన్యపురిలో గోల్డెన్ కేర్ నిర్వహించిన పోలీసులు
ఎల్బీనగర్: సీనియర్ సిటిజన్లకు చట్టపరంగా అండగా ఉంటామని చైతన్యపురి పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వృద్ధులకు చట్ట పరంగా వృత్తిపరంగా పోలీస్ సేవలను సమర్థవంతంగా అందించే ఉద్దేశ్యంతో గురువారం గోల్డెన్ కేర్ కార్యక్రమాన్ని నేరేడ్ మెట్ లోని కమిషనర్ ఆఫీసులో ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కె.సైదులు పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేశ్ పురి కాలనీ, ద్వారకాపురి కాలనీలో ఉన్న వృద్ధుల దగ్గరికి వెళ్లి సీనియర్ సిటిజన్లతో మాట్లాడారు.
పిల్లలు సరిగా చూసుకోకపోయినా, భోజనం పెట్టకపోయినా, తల్లిదండ్రులను హింసించినా చట్టపరంగా ఏ చర్యలు తీసుకుంటారో వివరించి, పోలీసులు అండగా ఉంటారని భరోసా కల్పించారు. ఎవరైనా వృద్ధులను ఇబ్బందులకు గురి చేస్తే హెల్ప్ లైన్ నెంబరు 14567 కి కాల్ చేసి పోలీసు సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వృద్ధులకు గోల్డెన్ కేర్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎస్సై వి.ప్రభాకర్, ఏఎస్సై ఎం.గోవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.