calender_icon.png 10 June, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొగసరి శుద్ధి అయోధ్య!

12-10-2024 01:25:27 AM

‘ఈ విజయ దశమికి శుద్ధి అయోధ్య సొగసు చూస్తారు’ అని పేర్కొంటూ ‘8 వసంతాలు’ చిత్రబృందం ఓ అందమైన అమ్మాయి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో వదిలింది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ సొగసరి ఎవరో కాదు.. ‘మ్యాడ్’ చిత్రం ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్. ఆమె నటిస్తున్న తాజా చిత్రమే ‘8 వసంతాలు’.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నవీయ్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూరుస్తుండగా, సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి అందిస్తున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.

19 నుంచి 27 ఏళ్ల మధ్య 8 సంవత్సరాల కాలంలో ఓ యువతి పరివర్తనాత్మక ప్రయాణమే ఈ చిత్రమని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ పాత్ర పేరు ‘శుద్ధి అయోధ్య’ కావడంతో దసరా పండుగ సందర్భంగా ఆమె క్యారెక్టర్ రివీల్ చేయనున్నారు. మరి విజయ దశమి నాడు పలుకరించనున్న సొగసరి ‘శుద్ధి అయోధ్య’ శుభాకాంక్షలు అందుకోవడానికి మీరూ సిద్ధమే కదూ!