12-10-2024 01:24:40 AM
హీరోయిన్‌గానే కాక గాయకురాలిగానూ సత్తా చాటుతోంది శ్రుతిహాసన్. తాజాగా ప్రపంచ మానసిక వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను రూపొందించిన శ్రుతి సంగీతానికి మించిన మానసిక వైద్య సాధనం లేదని చెబుతోంది. ఈ ఆరోగ్య సూత్రాలు ఆలోచింపజేస్తున్నాయి.
‘అందరూ మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడేందుకు జంకుతారు. ఇది ముందు పక్కన పెట్టాలి. అప్పుడే దీనిగురించి బహిరంగంగా మాట్లాడి స్వాంతన పొందే ప్రయత్నం చేయగలుగుతాం. చుట్టూ ఉన్నవాళ్లను, ఇష్టమైన వ్యక్తులను ఆత్మీయంగా పలకరించడం, వారితో కాసేపు గడపడం వంటివి చేస్తే మానసిక స్థితి కుదుటపడుతుంది.
సంగీతం అన్నిటినీ మించిన మానసిక వైద్య సాధనం’ అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ‘లెవెన్’ చిత్రం కోసం శ్రుతిహాసన్ పాడిన ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్’ పాటను ఆమె తండ్రి, నటుడు కమల్‌హాసన్ విడుదల చేశారు. ఇదిలాఉండగా, శుక్రవారం తాను ప్రయాణించాల్సిన ఇండిగో విమానం ఆలస్యమవడంపై అసహనం వ్యక్తం చేసింది శ్రుతి. ఈ విషయాన్ని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.