17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మట్టి మాఫియాని అడ్డుకోండి

13-06-2025 10:54 PM

బోడగుట్టను కాపాడండి

డిప్యూటీ తహసిల్దార్ కు  వినతిపత్రం

వలిగొండ,(విజయక్రాంతి): మట్టి మాఫియాని అడ్డుకొని వేదశ్రీ వెంచర్ ప్రక్కన గల గుట్టను కాపాడాలని అరూర్ గ్రామానికి చెందిన పలువురు డిప్యూటీ తహసిల్దార్ పల్లవికి  వినతి పత్రం అందజేశారు. శుక్రవారం మండలంలోని అరూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భూ భారతి కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ తహసీల్దార్ ని  వేద శ్రీ వెంచర్ దగ్గర గల 409 సర్వే నంబర్ గుట్టలకు అనుకోని ఉన్న భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని అట్టి భూమికి సర్వే చేయించి హద్దు రాళ్ళు నాటించాలని మట్టిని కూడా తీసుకొని వెళ్లకుండా చూడాలని కోరారు. గుట్ట వెంట పశువులను జీవాలను మేపుకుంటూ ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారని, మట్టి తీయడంతో చెట్లు గడ్డి లేకుండా పోతుందని దీంతో పశువులకు జీవాలకు మేత దొరకకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా బద్ధం రామకృష్ణ రెడ్డి కాలనీ పక్కన బోడ గుట్ట చుట్టూ కూడా హద్దు రాళ్ళు నాటించాలని కోరారు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో అరూర్ గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు.