calender_icon.png 15 June, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా ఖైదీల చేతి వృత్తుల ప్రదర్శన

14-06-2025 12:00:00 AM

  1. డీజీ సౌమ్య మిశ్రా చొరవతో వినూత్న ప్రయత్నం

‘ఫిక్కీ ఫ్లో స్టుల్‌తత్వ ఎడిషన్ 5’లో తెలంగాణ జైళ్ల శాఖ స్టాల్

స్టాల్‌ను ప్రారంభించిన మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): తెలంగాణ జైళ్ల శాఖ, ఫిక్కీ సహకారంతో డాక్టర్ సౌమ్య మిశ్రా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కరెక్షనల్ సర్వీసెస్ నేతృత్వంలో మహిళా ఖైదీల చేతి వృత్తుల ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని ప్రముఖ వార్షిక ఫ్యాషన్, లైఫ్‌స్టుల్ ఈవెంట్ ‘ఫిక్కీ ఫ్లో స్టుల్‌తత్వ ఎడిషన్ 5’లో తొలిసారిగా జైళ్ల శాఖ ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.

ఈ ఎగ్జిబిషన్ శుక్రవారం హిట్‌ఎక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి ప్రారంభించారు. జైళ్ల శాఖ స్టాల్‌లో తెలంగాణ జైళ్లలోని మహిళా ఖైదీలు తయారుచేసిన స్ఫూర్తిదాయకమైన చేతివృత్తుల ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి.

పోట్లీ బ్యాగ్‌లు, ఉన్ని వస్తువులు, జనపనార సంచులు, ప్లాజో ప్యాంట్లు వంటివి ఇందులో ఉన్నా యి. ఈ గుర్తింపు వారిని మరింత కష్టపడి పనిచేయడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, నాణ్యమైన వస్తువు లను ఉత్పత్తి చేయడానికి మరింత సమయాన్ని వెచ్చించడానికి ప్రోత్సహిస్తుంది.