స్థానిక స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం
ఆర్.డి.ఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ టౌన్, మే 4 : స్థానిక స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం చూపించాలని లక్ష్యంతో ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ పట్టణం రెవెన్యూ డివిజన్ కార్యాలయం(ఆర్.డి.ఓ)లో డివిజన్ స్థాయి ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యల పరిష్కారం కొరకు దూరంగా ఉండే కలెక్టర్ కార్యాలయానికి పొనవసరంలేదని,ఇప్పటినుండి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్థానికంగా ఉండే ఆర్.డి.ఓ కార్యాలయంలో నిర్వహించే డివిజన్ స్థాయి ప్రజావాణి లో కూడా సమర్పించ వచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ నవీన్, అర్బన్ తహసీల్దార్ ఘాన్సీరాం నాయక్, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.






