తండ్రిని హత్య చేసిన కొడుకు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఘటన
జహీరాబాద్, ఏప్రిల్ 1: ఆస్తి కోసం తం డ్రిని అతి దారుణంగా కన్న కొడుకు హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జరిగింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్‌పల్లికి చెం దిన తాజుద్దీన్ (60) కొంతకాలంగా జహీరాబాద్‌లోని భరత్ నగర్‌లో కూలి పని చేసుకుంటూ ఉంటున్నారు. తాజుద్దీన్‌కు భూచన్ పల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది.
భూమి పంపకాల విషయంలో తాజుద్దీన్ కుమారుడు ఖాజా, కో డలు బిపాష, బిపాష సోదరి రిహానా బేగం గొడవపడి బుధవారం ఆ ముగ్గురు కలిసి తాజుద్దీన్ కళ్లల్లో కారంపొడి కొట్టి అనంతరం కత్తులతో పొడిచారు. దీంతో తాజుద్దీన్ మృతిచెందాడు. సీఐ శివలింగం, ఎస్‌ఐ వినయ్ కు మార్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.




