12 July, 2026 | 5:57 PM

Breaking News

ఎస్‌ఐఆర్ వేగవంతంగా పూర్తి చేయండి

12-07-2026 04:50 PM

రెవెన్యూ అదనపు కలెక్టర జెఎల్బి హరిప్రియ

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ త్వరగా చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర జెఎల్బి హరిప్రియ అన్నారు. ఆదివారం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను జడ్చర్ల ఎన్నికల నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్‌ఓ) రెవెన్యూ అదనపు కలెక్టర్ జెఎల్బి హరిప్రియ మిడ్జిల్ మండలం వేముల గ్రామంలోని పోలింగ్ కేంద్రం నెం. 258ను, వెలుగోముల గ్రామం పోలింగ్ కేంద్రం నెం. 239ను, బైరాన్ పల్లి పోలింగ్ కేంద్రం నెంబర్ 231 లను సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇప్పటివరకు నమోదైన డిజిటలైజేషన్ పురోగతిని సమీక్షించారు. ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో అత్యల్ప డిజిటైజేషన్ నమోదును గమనించిన అదనపు కలెక్టర్ ఏన్యూమరైజేషన్ ఫారాల డిజిటైజేషన్ను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బిఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్‌ఓ, తహసీల్దార్, బీఎల్‌ఓ సూపర్వైజర్, గ్రామ సర్పంచ్, బీఎల్‌ఓలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.