మనోభావాలు దెబ్బతింటే సారీ!
18-06-2024 04:39 AM
- మోదీ, పోప్ ఫ్రాన్సిస్ భేటీపై కేరళ కాంగ్రెస్ సెటైరికల్ పోస్టు
వివాదం ముదరడంతో క్రైస్తవ సమాజానికి క్షమాపణలు
న్యూఢిల్లీ, జూన్ 17 : ప్రధాని నరేంద్ర మోదీపై సెటైరికల్‌గా ఓ పోస్ట్ చేసి.. అది కాస్త తీవ్ర దుమారం రేపడంతో కేరళ కాంగ్రెస్ యూనిట్ క్షమాపణలు చెప్పింది. ఇటలీలో జరిగిన జీ7 సమ్మిట్‌కు హాజరైన ప్రధాని మోదీ పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు. వారిద్దరికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసిన కేరళ కాంగ్రెస్ యూనిట్ “ఎట్టకేలకు.. దేవుడ్ని కలిసే అవకాశం పోప్‌కు దక్కిందంటూ” ఫన్నీ మీమ్ పోస్ట్ చేసింది. దీంతో, ఈ పోస్టుపై బీజేపీ మాటల యుద్ధానికి దిగింది. ఆ పోస్టు కేవలం మోదీని మాత్రమే కాదని.. పోప్‌ను కూడా అవమానించడమే అని పేర్కొంది. ఈ వివాదం ముదరడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గి క్రైస్తవ సమాజానికి క్షమాపణులు చెప్పింది.






