calender_icon.png 18 July, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు

18-07-2025 08:36:59 PM

110 లీటర్ల కల్తీ పాలు 1.1 హైడ్రోజన్ పెరాక్సైడ్ స్వాధీనం

మేడిపల్లి: కల్తీ పాల స్థావరంపై ఎస్ఓటి పోలీసులు 110 లీటర్ల కల్తీ పాలు తయారు చేస్తున్న స్థావరంపై దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడిపల్లి  పరిధిలోని పర్వతాపురం , సాయి మహదేవ్ నగర్ లో అక్రమంగా హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ తో  కల్తీ పాలు తయారు చేస్తున్న మురళీకృష్ణ రెడ్డి ఇంటిపై మల్కాజ్గిరి కి చెందిన ఎస్ ఓ టి పోలీసులు  ఏఎస్ఐలు మల్లేష్, నాగేందర్ , స్థానిక పోలీసులు శుక్రవారం దాడి చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బాధితుని ఇంట్లో 110 లీటర్ల కల్తీ పాలు 1.1 లీటర్ల హైడ్రోజన్ ఫెరాక్సైడ్, 19 గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకొని బాధితుడు  మురళీకృష్ణారెడ్డి పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.