18-07-2025 08:57:32 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రతి నెల 3 వ శుక్రవారం ప్రయాణికుల మర్యాద దినోత్సవం శుక్రవారం జరుపుకున్నారు రఅదే విధంగా నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ లో డిపోమేనేజర్ కే పండరి ఆధ్వర్యంలో అసిస్టెంట్ మేనేజర్ దేవాపల బస్సులలో ఎక్కి ప్రయాణికులకు గులాబీ పువ్వు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని, ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం,సుఖవంతం అని తెలిపారు. ఈ కార్యక్రమములో బస్టాండ్ కంట్రోలర్లు బిబి గౌడ్, టీవి రమణ గజపతి పాల్గొన్నారు.