2 June, 2026 | 5:30 PM

జెండా కోసం గొడవ.. వేడుకల్లో అపశృతి

02-06-2026 04:36 PM

- పోలీసుల సాక్షిగా

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధిపత్య పోరుకు తెలంగాణ అవతరణ వేడుక వేదిక అయింది.  కాంగ్రెస్, బిఆర్ ఎస్ పార్టీల నేతలు పతాకావిష్కరణ కోసం గొడవ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. 13వార్డులో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. 13వార్డులో బీ ఆర్ ఎస్ మునిసిపల్ కౌన్సిలర్ డి. రాజ్కుమార్ జాతీయ పతకాన్ని జాతీయ జండాను ఎత్తుతుండగా, కాంగ్రెసు పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్ తో తన అనుచరులతో అక్కడి కి చేరుకుని అడ్డుకున్నారు.

జాతీయ జెండాను లా కొన్నారు. దీంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ  నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాలు తోపులాడుకున్నాయి. పరస్పర వాగ్వాదనలకు తలపడ్డారు. అక్కడే ఉన్న బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ కిరణ్ వారిని సముదాయించారు. పోలీసులు గొడవ కాకుండా అడ్డుక్కన్పటికీ జాతీయ జెండా  అవమానన్ని మాత్రం ఆపలేకపోయారు. ఈ విషయంలో గులాబీ పార్టీ కౌన్సిలర్ రాజకుమార్ పోలీసులకి ఫిర్యాదు ఇచ్చారు.

జాతీయ జండాను అవమానించిన అధికార పార్టీ కి చెందిన బండి ప్రభాకర్ విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఇరువర్గా ల మధ్య పోరు కు ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ లక్షలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎన్నికల్లో రా కుమార్ గెలుపొందారు. బండి ప్రభాకర్ ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ కక్షలు సమసి పోలేదు.