ఇది ఆరంభం మాత్రమే: దాదా
కోల్‌కతా: టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కానంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదని రింకూ సింగ్‌ను ఉద్దేశించి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. రింకూకు ఇది ఆరంభం మాత్రమే అని భవిష్యత్తులో అతడు టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. టీ20 వరల్డ్‌కప్‌నుకు ఎంపిక చేసిన భారత జట్టుపై దాదా స్పందిస్తూ.. ‘ఐసీసీ లాంటి మెగా టోర్నీలకు బీసీసీఐ అత్యుత్తమ జట్టునే ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో బాగా రాణిస్తున్నప్పటికి కొంతమంది ఆటగాళ్లకు చాన్స్ దక్కకపోవచ్చు. రింకూ సింగ్ ఈ కోవకు చెందినవాడే. వెస్టిండీస్ లాంటి బౌలింగ్ పిచ్‌లపై వరల్డ్‌కప్ జరుగుతుండడంతో జట్టుకు అదనపు స్పిన్నర్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రింకూకు చాన్స్ దక్కలేదని భావిస్తున్నా. దీనికే అతడు బాధపడాల్సిన అవసరం లేదు. రింకూకు ఇది ఆరంభం మాత్రమే’ అని వెల్లడించాడు. ఇక రింకూ సింగ్ భారత్ తరపున 15 టీ20 మ్యాచ్‌ల్లో 356 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా తరపున రింకూ బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.






