12 July, 2026 | 5:26 PM

Breaking News

సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •   జగన్నాథ రథయాత్రను విజయవంతం చేద్దాం   •   ఎస్‌ఐఆర్ వేగవంతంగా పూర్తి చేయండి   •   నాని ఈవీ మోటార్స్ షోరూంను ప్రారంభించిన మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి   •   పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన డీఈవో   •  

బెంగళూరు x గుజరాత్

04-05-2024 01:03 AM

బెంగళూరు: ఐపీఎల్లో ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోయిన అనంతరం వరుస విజయాలతో చెలరేగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంతగడ్డపై మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. బెంగళూరు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు గుజరాత్ కూడా పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తోంది. సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన గుజరాత్ 8 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. బెంగళూరుతో పోలిస్తే ఒక విజయం అదనంగా ఉండడంతో గిల్ సేనకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరుజట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో విల్ జాక్స్ విధ్వంసకర సెంచరీతో బెంగళూరు పైచేయి సాధించింది.

మరి నేటి మ్యాచ్‌లో గుజరాత్ గెలిచి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుటుందా చూడాలి. బెంగళూరు బ్యాటింగ్‌ను విరాట్ కోహ్లీ అన్నీ తానై నడిపిస్తున్నాడు. కెప్టెన్ డుప్లెసిస్ విఫలమవుతుండగా.. హిట్టర్ విల్ జాక్స్ సూపర్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. మ్యాక్స్‌వెల్, కామెరున్ గ్రీన్, రజత్ పాటిదార్ పేలవ ఫామ్ జట్టును కలవరపరుస్తోంది. బౌలింగ్ విభాగం బలహీనంగానే కనిపిస్తోంది. సిరాజ్, యష్ దయాల్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్‌లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఇక గుజరాత్ బ్యాటింగ్ కూడా గందరగోళంగా ఉంది. ఓపెనర్ సాహా ఘోరంగా విఫలమవుతుండగా.. సాయి సుదర్శన్ ఒక్కడే పర్వాలేదనిపిస్తున్నాడు. కెప్టెన్ గిల్‌తో పాటు డేవిడ్ మిల్లర్, తెవాటియా, షారుక్ ఖాన్‌లు రాణించలేకపోతున్నారు. మోహిత్ శర్మ, సాయి కిషోర్, రషీద్ ఖాన్‌లతో  బౌలింగ్ విభాగం పర్వాలేదనిపిస్తోంది.