6 May, 2026 | 1:48 AM

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్

06-05-2026 12:42 AM
  1. గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
  2. జోన్ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు 
  3. కొత్తగా ఏర్పడే విశాఖపట్నం డివిజన్ సైతం
  4. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే సేవలు మరింత మెరుగు
  5. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు: ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి/న్యూఢిల్లీ, మే 5: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి జోన్ పరిధిలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభమవుతా యని స్పష్టం చేసింది. కొత్త జోన్ పరిధి ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించి ఉంటుంది.

జోన్‌పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతోపాటు కొత్తగా ఏర్పడే విశాఖపట్నం డివిజన్ సైతం అంతర్భాగంగా ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఉన్న రైల్వే లైన్ ఇప్పుడు విశాఖ డివిజన్ పరిధిలోకి వచ్చింది. రాయచూర్ నుంచి వాడి వరకు ఉన్న సెక్షన్ సికింద్రాబాద్ డివిజన్‌కు వెళ్లగా, మిగిలిన కీలక ప్రాంతాలన్నీ కొత్త జోన్ కిందకే వస్తాయి. వాల్తేరు డివిజన్‌ను పునర్వ్యవస్థీకరించి విశాఖ డివిజన్‌గా మారింది.

అదే విధంగా నౌపడ -- పర్లాకిమిడి, బొబ్బిలి-- సా లూరు లైన్లు, సింహాచలం- -వడ్లపూడి, విశాఖ-- జగ్గయ్యపాలెం రైల్వేలైన్లు సైతం విశాఖ డివిజన్‌లో విలీనమయ్యాయి. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా మరో కొత్త డివిజన్ ఏర్పాటు కావడంతో సరిహద్దులు మారాయి. జోన్ ఏర్పాటుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. కొత్త రైల్వే జోన్ పరిధిలో 74 స్టేష న్లు ఆధునికీకరణ, 1,039 కి.మీ. మేర కొత్త లైన్ అందుబాటులోకి వస్తుంది.

ప్రధాన పో ర్టులు, పారిశ్రామిక హబ్‌లు కలుపుతూ రైల్వే లైన్లు విస్తరిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పై ఏపీ ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో దోహద పడుతుందని ఆ ప్రాంత ప్రజలు సంతోషపడు తున్నారు. తమ బిడ్డలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రాం తంలో రైల్వే సేవలు పెరు గుతాయని ఆకాంక్షిస్తున్నారు. 

చిరకాల స్వప్నం సాకారం: ఏపీ సీఎం 

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని కొనియాడారు. 

సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు 

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని మంగళవారం కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తుల సంఖ్యను ౩4 నుంచి ౩8 పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు- 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వ తాజాగా నిర్ణయంతో సుప్రీం కోర్టులో నలుగురు న్యాయమూర్తులు అదనంగా నియమితులుకానున్నారు.

దేశ అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌దారులకు, బాధితులకు మరింత సత్వర న్యాయం అందించేందుకు తాము తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందని కేంద్రం ఆకాంక్షించింది. కేసుల పరిష్కార వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. క్యాబినెట్ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. న్యాయ వ్యవస్థ సమర్థతను పెంచేందుకు తమ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు.