బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జాయింట్ సెక్రెటరీగా మండల నాయకులు.
13-08-2026 09:49 PM
బోథ్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జాయింట్ సెక్రెటరీగా మండలానికి చెందిన గొండ్ల భోజరాజు మారుతీ లను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు రాఘవేంద్ర ముదిరాజ్ వీరిపై నమ్మకంతో కొడవలను కట్టబెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశాలనుసారంగా పనులను చేపడతామన్నారు.






