6 May, 2026 | 11:45 AM

TVK ఆపరేషన్ ఆకర్ష్..! విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్

06-05-2026 11:14 AM

చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు తమిళగ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam) సిద్ధమైంది.  గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్ పిలుపు కోసం టీవీకే ఎదురుచూస్తోంది. టీవీకే అధినేత విజయ్ రేపు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. తమిళనాడులో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ సీట్లు(118) దక్కలేదు. దీంతో టీవీకే మ్యాజిక్ ఫిగర్‌కి అవసరమైన ఎమ్మెల్యేల కోసం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది.

 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీవీకే పార్టీ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 10 సీట్లు అవసరం. 5 సీట్లలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీవీకే బలం 113కు చేరింది. కాంగ్రెస్ మద్దతు తెలిపిన ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మరో ఐదు సీట్లు అవసరం.అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే పార్టీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంకే నాలుగు స్థానాల్లో గెలుపొందింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ఐయూఎంఎల్ ముందుకొచ్చింది. టీవీకేకు.. డీఎంకే కూటమిలోని సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ 2 సీట్ల చొప్పున గెలిచాయి. ఈ  మూడు పార్టీలు మద్దతిస్తే టీవీకే బలం 125కు చేరుకోనుంది.