5 May, 2026 | 4:18 AM

విజయ్ంపై తారల స్పందన

05-05-2026 02:57 AM

పలువురు దక్షిణాది సినీ తారలు ‘దళపతి’ విజయంపై స్పందించారు. “విజయ్ అన్నా.. రాజకీయాల్లోకి రావడం ఒకెత్తు అయితే, వచ్చిన మొదటిసారే ఇలాంటి ప్రభంజనం సృష్టించడం అద్భుతం. మీ పట్టుదలకు దక్కిన ఫలితం ఇది” అని సందీప్ కిషన్ పేర్కొన్నారు. శ్రీవిష్ణు స్పందిస్తూ “విజయ్ విజయం స్ఫూర్తిదాయకం. నిజాయితీగా ప్రజల కోసం నిలబడితే విజయం దానంతట అదే వస్తుందని మీరు నిరూపిం చారు. అభినందనలు విజయ్‌” అని రాసుకొచ్చారు. “ఒక సైనికుడిలా మొదలై ఈ రోజు ఒక నాయకుడిగా ఎదిగారు.

మీ రాజకీయ ప్రయాణం తమిళనాడు అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని మంచు మనో జ్ ట్వీట్ చేశారు. హీరో నిఖిల్ సిద్ధార్థ స్పందిస్తూ.. “మన భారతీయ సినిమాకు చెందిన విజయ్ విజయం చూస్తుంటే గర్వంగా ఉంది. ఇది ఒక చరిత్రాత్మక విజయం” అని అభివర్ణించారు. నటుడు టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ.. “అభినందనలు విజయ్. మీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. మరింత బలంగా ముందుకు సాగండి” కోరారు. “ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుందనడానికి ఇదొక చారిత్రాత్మక ఉదాహరణ. విజయ్.. మీపై గౌరవం మరింత పెరిగింది” అని మలయాళ నటుడు అజు వర్గీస్ రాసుకొచ్చారు. “కంగ్రాట్స్ విజయ్. ఇది చారిత్రాత్మక విజయం. గతంలో ఇలాంటి గెలుపు లేదు.. భవిష్యత్తులో రాదు” అని సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్ పేర్కొన్నారు.