పాత పెన్షన్ హామీ మరిచారా
భైంసా,(విజయక్రాంతి): అధికారంలోకి వచ్చాక పాత పెన్షన్ ఇస్తామన్న హామీ మరిచారా అని సిపియస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిపియస్ కృష్ణారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు సిపియస్ పై ముందడుగు పడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన ఉద్యోగులకు నెలకు రెండు వేలు, మూడు వేలు మాత్రమే పెన్షన్ వస్తున్నదని విచారం వ్యక్తం చేశారు. చట్ట సభల సభ్యులకు పెన్షన్ ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు ఉండ కూడదని ప్రశ్నించారు. మీరు పెన్షన్ తీసుకుంటూ మా పెన్షన్ తీసేస్తారా, ఇదేం అన్యాయమని ప్రశ్నించారు. కుటుంబ పెన్షన్ జి. ఓ.కు సవరణ చేయాలని కోరారు. ఒకే విడతలో డి. ఏ.బకాయిలు చెల్లించాలని కోరారు. పాత పెన్షన్ సాధనకు ఆమరణ దీక్షకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.






