మెట్ పల్లి తహసీల్దార్ నీత సస్పెండ్
విధుల్లో నిర్లక్ష్యంపై తహసీల్దార్ పై కలెక్టర్ వేటు
మెట్ పల్లి,(విజయక్రాంతి): విధుల్లో నిర్లక్ష్యంపై మెట్ పల్లి తహసీల్దార్ నీత ను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం సస్పెండ్ చేశారు.స్థానిక ఆర్డివో నరసింహ రావు తెలిపిన వివరాలు ప్రభుత్వం చేపట్టిన భూ భారతి రీ సర్వే -ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దింతో భూ భారతి రీ సర్వే ప్రత్యేక ఓటరు సవరణ పనులలో తహసీల్దార్ నిర్లక్ష్యం వహించి గడువులోగా పూర్తి చేయక పోవడాన్ని గుర్తించి ఆమె ఆలసత్వాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ మెట్ పల్లి తహసీల్దార్ ను సస్పెండ్ చేసినట్లు ఆర్డివో పేర్కొన్నారు. సస్పెండ్ అయిన నీత స్థానంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ముఫ్తార్ పాషాను మెట్ పల్లి తహసీల్దార్ గా కలెక్టర్ నియమించారు. మెట్ పల్లి తహసీల్దార్ నీత సస్పెండ్ తో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఏ అధికారి అయిన సస్పెండ్ వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసినట్లు అయింది.






