14 July, 2026 | 8:16 PM

సౌత్ కొరియా అధ్యక్షుడి అభిశంసన!

05-12-2024 02:50 AM

పార్లమెంట్‌లో ప్రతిపక్షాల తీర్మానం

కొన్ని గంటల్లోనే ఎమర్జెన్సీ ఉపసంహరణ

పరిణామాలను గమనిస్తున్న అమెరికా

సియోల్, డిసెంబర్ 4: ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని అభియోగం మోపుతూ సౌత్‌కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్  మంగళవారం దేశంలో మార్షల్ లా విధించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో దేశంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మార్షల్ లా ప్రకటించిన ఆరు గంటల్లోనే అధ్యక్షుడు తన నిర్ణయాన్ని  ఉపసంహరించుకున్నారు.

ఈ క్రమంలోనే జాతినుద్ధేశించి యూన్ ప్రసంగించారు. జాతీయ అసెం బ్లీ నుంచి డిమాండ్ రావడంతో దేశంలో ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. మార్షల్ లా కార్యక లాపాల కోసం జాతీయ అసెంబ్లీ అభ్యర్థనను అంగీకరిస్తామన్నారు. క్యాబినెట్ సమావేశం ద్వారా ఎమర్జెన్సీని ఎత్తివేస్తామని ఆయన ప్రకటించారు. అంతకు ముందు అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అర్ధరాత్రి జరిగిన పార్లమెంట్ సెషన్‌లో ఎంపీలు మార్షల్ లాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 300 మంది సభ్యుల్లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన 190 మంది ఎమర్జెన్సీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

దీంతో నాటకీయ పరిణా మల మధ్య ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నట్లు అధ్యక్షుడు యోల్ ప్రకటిం చారు. అయినప్పటికీ అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌లో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. పార్లమెంట్‌లో మొత్తం 300 సభ్యులు ఉన్నారు. అధ్యక్షుడిపై అభిశంసన గట్టెక్కాలంటే 200 మంది సభ్యుల మద్దతు ఉండాలి.

అలాగే కనీసం ఆరుగురు న్యాయమూర్తులు తీర్మానానికి  అనకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని శుక్రవారం లోగా ఓటింగ్‌కు తీసుకురావచ్చని డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు కిమ్ యోంగ్ మిన్ తెలిపారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ మార్షల్ లా అమలును వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్ల మెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం ఎమర్జెన్సీ అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్ ప్రకటించారు.

కాగా అధ్యక్ష పదవి నుంచి యోల్  వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు ఆయన సలహా దారులు, కార్యదర్శులు వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు దేశంలో ఎమర్జెన్సీ విధించగానే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. దీంతో దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇక కొరియాలో చివరి సారిగా 1980లో ఎమర్జెన్సీ లాను విధించారు. దాదాపు ఐదు దశాబ్దాల తరు వాత సౌత్‌కొరియాలో మార్షల్ లాని విధించి విరమించుకున్నారు. కాగా దక్షిణ కొరియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని దాని మిత్రదేశం అమెరికా పేర్కొన్నది.

పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత..

 మార్షల్ లాను వ్యతిరేకిస్తూ ఎంపీలు, ప్రజలు పార్లమెంట్ వద్ద భారీగా చేరారు. వాళ్లను లోపలికి వెళ్లనివ్వకుండా భద్రతా బలగాలు అడ్డుకు న్నాయి. 2022లో పీపుల్స్ పవర్ పార్టీ తరపున యూన్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. అప్పటినుంచి ఆయన ప్రతిపక్షాల వైఖరితో ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. మరోవైపు అధ్యక్షుడి భార్య, ఆయన పేషీ ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వారిని విచారించాలని ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి.