14 July, 2026 | 8:45 PM

ఘనంగా నేవీ డే

05-12-2024 02:51 AM
  1. ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ముర్ము
  2. ఆకట్టుకున్న ప్రదర్శనలు

పూరీ, డిసెంబర్ 4: పూరీ తీరంలో జరిగిన నేషనల్ నేవీ డే ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. నేవీ అధికారులకు ముర్ము అభినందనలు తెలిపారు. ‘మాతృభూమి కోసం నేవీ చేస్తున్న త్యాగాలు గొప్పవి. 1971 డిసెంబర్ 4న నేవీ చూపిన తెగువకు గుర్తుగా ఈ రోజును జరుపుకుంటున్నాం. 2047 నాటికి వికసిత్ భారత్ కోసం అవసరమైన సముద్ర భద్రతను నేను కొనసాగిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. 2047 నాటికి నేవీ ఆత్మనిర్భర్ దళంగా మారుతుంది. మహిళా సాధికారత కోసం నేవీ చేస్తున్న కృషి అమోఘం’.