20 June, 2026 | 3:59 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

కెప్టెన్సీకి సౌథీ గుడ్ బై

03-10-2024 12:00 AM

ఆక్లాండ్: భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్లో పెను దుమారం రేగింది. టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్న టిమ్ సౌథీ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. సౌథీ స్థానంలో టామ్ లాథమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పుతూ కివీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. శ్రీలంక చేతిలో 2-0 తేడాతో వైట్ వాష్‌కు గురి కావడంతో సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సౌథీ కెప్టెన్సీలో కివీస్ 14 టెస్టులు ఆడగా.. అందులో ఆరింట గెలిచి మరో ఆరింట ఓడిపోయింది. మిగిలిన రెండు టెస్టుల ను డ్రాగా ముగించుకుంది. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన టామ్ లాథమ్‌కు సౌథీ ఆల్ ది బెస్ట్ తెలిపాడు. తనకు ఇన్ని రోజులు సహకరించిన ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు.