calender_icon.png 16 August, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్ఫరాజ్ డబుల్ సెంచరీ

03-10-2024 12:00:00 AM

లక్నో: ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 536 పరుగులు చేసింది. యువ బ్యాటర్ సర్ఫరాజ్ (221*), జునైద్ ఖాన్ (0*) క్రీజులో ఉన్నారు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేష్ కుమార్ 4, యశ్ దయాల్, ప్రసిధ్ కృష్ణ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా కానీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్ ఖాన్ ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. సర్ఫరాజ్ డబుల్‌కు తోడు, కెప్టెన్ రహనే (97), అయ్యర్ (57), కొటియాన్ (64) అర్ధ సెంచరీలు చేయడంతో రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న టోర్నీలో ముంబై భారీ స్కోరు చేసింది. రెస్టాఫ్ ఇండియా బౌలర్లు ఎంత చెమటోడ్చినా కానీ ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను మాత్రం నిలువరించలేకపోయారు.