26 April, 2026 | 3:54 PM

ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న సోయం వీరభద్రం

26-04-2026 02:14 PM

దమ్మపేట,(విజయక్రాంతి): అశ్వరావుపేట మండలం, పాత నారంవారిగూడెం గ్రామం లో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ, ద్వజస్తంభం, శిఖర గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లీ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం లో జిల్లా బి ఆర్ ఎస్ నాయకులు సోయం వీరభద్రం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు  ఘన స్వాగతం పలికారు. అనంతరం  కమిటీ సభ్యులుతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గోని ఆలయ అభివృద్ధి నిమిత్తం 5,000/- రూపాయలు స్థానిక బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మునుగొండ నాగమణి చేతులు మీధుగా ఆలయ కమిటీ సభ్యులకు అంధజేసారు.

ఈ సంధర్భంగా సోయం వీరభద్రం మట్లాడుతూ... ఇటువoటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ద్వారా ప్రజల్లో భక్తి భావాలు పెరుగుతాయని, శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల దివ్య ఆశిస్సులు సమస్త ప్రజననీకం పైన ఉండి సుఖసంతోషాలుతో, పాడి పంటలతో వర్ధిల్లాలని సోయం వీరభద్రం కోరారు. అనంతరం దమ్మపేట మండలం గుండిపట్వారిగుడెం గ్రామం లో గుండే ముత్యాలరావు సరోజని దంపతుల కుమారుడు ధనుoజయరావు-లక్ష్మీశ్రీరాణి ల వివాహం కి హాజరు అయ్యి నూతన వధూవరులను ఆశీర్వధించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్  సీతామహాలక్ష్మి, తెల్లమేకల కృష్ణారావు, వెంకటేశ్వరరావు, మంగరావు, చిమటబోయిన సురేష్, లగడపాటి మల్లికార్జునరావు రావు,వేముల కొర్రాజులు నాగు, కీసరి మల్లికార్జునరావు, కానిస్టేబుల్  కనకరాజు, సోయం వెంకన్నబాబు, గుండి శంకర్ తధితరులు పాల్గొన్నారు.