సైబర్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల: సైబర్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్, బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పవద్దని, ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని, ప్రజలు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. వారం రోజుల వ్యవధిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు వివరాలను మీడియా సమాశంలో వెల్లడించారు.
ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని ఓటిపి అడగగా బాధితుడు ఓటిపి షేర్ చేసుకోవడం జరిగింది. దాంతో 42,000 రూపాయలు నష్టపోయారని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పీఎం కిసాన్ పేరుతో ఒక ఏపీకే ఫైల్ వాట్సాప్ గ్రూపులో రావడం జరిగింది బాధితులు దాన్ని క్లిక్ చేయగానే వారి ఫోన్ హ్యాక్ అవడం జరిగింది. తర్వాత కంటిన్యూగా ఓటీపీలు రావడం జరిగింది దాంతో రెండు లక్షల రూపాయలు నష్టపోయారని చెప్పారు.
సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు కొరియర్ సర్వీస్ కోసం గూగుల్ లో సెర్చ్ చేయగా ఒక నెంబర్ నుంచి ఫేక్ కాల్ వచ్చింది. ముంబై క్రైమ్ పోలీస్ మాట్లాడుతున్నామని మీ కొరియర్లో ఇల్లీగల్ వసూలు ఉన్నాయని చెప్పి బెదిరించగా వారు నిజమని నమ్మి రెండు లక్షల 25 వేల రూపాయలను పంపించి మోసపోయారని సూచించారు.






