అచ్చంపేటలో అనూహ్య పరిణామం.!
అచ్చంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ గురి
కత్తులు దూసి గొడవలకు కారణమైన కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరిక
నాగర్ కర్నూల్: అచ్చంపేటలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇరు పార్టీలు కత్తులతో దాడి చేసుకున్న ఘటనకు కారణమైన బిఆర్ఎస్ 2వ వర్డు కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజును శనివారం ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు ఇంటిపై దాడికి దిగారు. దానికి ప్రతిదాడిగా కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ కార్యకర్తలపై టిఆర్ఎస్ కౌన్సిలర్ భర్త సుంకరి బాలరాజు కత్తులతో అత్యంత కిరాతకంగా దాడికి యత్నించాడు.
ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేగింది. అయితే అనూహ్యంగా అదే బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ నిర్మల బాలరాజు మరి కొంతమంది తన వర్గం కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం అచ్చంపేటలో ఈ పరిణామం హాట్ టాపిక్ అయింది. ఈనెల 12న అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుందని ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మెజారిటీ కోసం బిఆర్ఎస్ పార్టీలో ఉన్న రెండో వార్డ్ కౌన్సిలర్ ను ఆహ్వానించినట్లు చర్చ జరుగుతుంది. ఫలితంగా గొడవలకు కూడా జరగకుండా పుల్ స్టాప్ పడుతుందన్న ఉద్దేశంతో పార్టీలోకి తీసుకున్నట్లు చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 11 నుండి 12 మంది కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానానికి ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.






