రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
08-06-2024 11:24 AM
రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం గర్భాలయంలో శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు పూజలు చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు






