హోంగార్డులకు ఎస్పీ సత్కారం
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి16 (విజయక్రాంతి): జిల్లా పోలీస్ శాఖలో దీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఇద్దరు హోంగార్డులను జిల్లా ఎస్పీ నితికా పంత్ ఘనంగా సత్కరించారు.కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన 1984 బ్యాచ్కు చెందిన సూర్యం, 1989 బ్యాచ్కు చెందిన బిక్షపతి పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా వారికి శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిబద్ధతతో సేవలందించిన సూర్యం, బిక్షపతి కృషి ప్రశంసనీయమని అన్నారు. సేవాకాలంలో చూపిన క్రమశిక్షణ, బాధ్యతాయుత వైఖరి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం వారు ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో హోంగారడ్స్ ఆర్‌ఐ విద్యాసాగర్, ఆర్‌ఐ అడ్మిన్ వామనమూర్తి పాల్గొన్నారు.




