పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
16-09-2026 | 12:02am
నిర్మల్,(విజయక్రాంతి): ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మైనార్టీ పెద్దలతో(minority elders) సమావేశం నిర్వహించారు. మతాల కచ్చితంగా ప్రజలందరూ పండుగలు పాల్గొన్నప్పుడే పండుగకు ఎంతో ఆనందమని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు(Ganesh for Navratri celebrations) పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. శాంతి భద్రతలకు విగాథం కలగకుండా అన్ని వర్గాల ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వస్తే వెంటనే పోలీసులకు తెలపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాస్ సిఐ సమ్మయ్య పోలీస్ అధికారులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.