15 April, 2026 | 11:07 AM

హాజీపూర్ తండా ఆలయంలో చోరీ

15-06-2025 04:14 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని హాజీపూర్ తాండలోని జగదాంబ మాత, సేవాలాల్ ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. తాండ వాసులు తెలిపిన కథనం ప్రకారం... ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తాండలో ఉన్న జగదాంబ మాత, సేవాలాల్ ఆలయంలో పూజారి దుప్య నాయక్ రోజువారి లాగే  పూజలు నిర్వహించి అనంతరం అలయానికి తాళం వేసి వెళ్లారు. కాగా  అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయంలో ఉన్న హుండీ గొలుసుతో వేసిన తాళాన్ని విరగొట్టి ఆలయంలోకి చొరబడి సూమారు రూ.30వేలు నగదును అపహరించారు. 

ఆదివారం ఉదయం ఆలయ పూజారి దుప్య నాయక్ వచ్చి చూడగా ఆలయంలో ఉన్న హుండీ కనిపించకపోవడంతో తాండ వాసులకు సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చి ఆలయం చుట్టూ పక్కల చూడగా ఆలయం పక్కన హుండీ తాళాలు పగలగొట్టి ఉండడంతో అందులో నగదు కనిపించలేదు. దీంతో ఆలయంలో చోరీ జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు క్లూస్ టీంకు సమాచారం ఇచ్చారు.