27 June, 2026 | 7:04 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

సృజనాత్మకతకు అంతరిక్షమే హద్దు

25-09-2024 03:43 AM

ఇస్రో చైర్మన్ సోమనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): సృజనాత్మకతకు అంతరిక్షమే హద్దు అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో  తెలుగు రీజియన్ మళయాళీ అసోసియేషన్, హైదరాబాద్ ఫోరమ్ ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పేస్ టూన్ పేరిట నిర్వహించిన కార్టూన్ ఎగ్జిబిషన్‌లో ఆయన మాట్లాడారు.

యువత ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్నారు. తాను యువకుడిగా ఉన్నపుడు కార్టూను గీసేవాడినని, తనకు కార్టూనిస్ట్‌లు అన్నా, కార్టూన్స్‌లో ఉండే చమత్కారమన్నా ఎంతో ఇష్టమని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యా, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేష్,  భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.