శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి
09-03-2026 03:31 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణ పరిధిలోని జనకాపూర్ గ్రామ ప్రజలు తమ గ్రామానికి సమీపంలో శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ కు ఇప్ప నాగరాజు, పర్రె గిరిధర్, గాజర్ల శైలేందర్ విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం గ్రామంలో శ్మశానవాటికకు సరైన స్థలం లేకపోవడంతో మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని వారు తెలిపారు. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జనకాపూర్ గ్రామానికి సమీపంలో ప్రభుత్వ భూమిని గుర్తించి శ్మశానవాటిక కోసం కేటాయించాలని వారు కోరారు. తమ సమస్యను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను అభ్యర్థించారు.




