calender_icon.png 18 February, 2026 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దానం అనర్హత పిటిషన్‌ పై స్పీకర్ విచారణ

18-02-2026 02:47:34 PM

హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. కౌశిక్ రెడ్డి, ఏలేటి స్పీకర్ విచారణకు హాజరయ్యారు. రేపు కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ పై  స్పీకర్ విచారించనున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కడియంపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేశారు.