calender_icon.png 12 November, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు నెలల్లో 5.48లక్షల ట్యాంకర్ల సప్లు

19-05-2024 02:17:50 AM

రోజుకు 4-6 వేల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (విజయక్రాంతి) : వేసవిలో గ్రేటర్ ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు హైదరాబాద్ జలమండలి అధికారులు తీసుకున్న ముందస్తు చర్యలు సఫలీకృతమయ్యాయి. గతేడాది వర్షాభావం వల్ల నగరంలోని భూగర్భజలాలు అడుగంటడంతో ఫిబ్రవరి నుంచే నీటికి డిమాండ్ పెరిగింది. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఎట్టకేలకు అవి ఫలితాన్నిచ్చాయి. వేసవి ప్రారం భంలో ప్రజల అవసరాలకు తగ్గట్లు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంలో జలమండలి అధికారులు ఇబ్బంది పడ్డప్పటికీ, ఇప్పుడు రికార్డు స్థాయిలో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లు చేస్తున్నారు. ప్రతీ రోజు సగటున 4 వేల ట్రిప్పుల వాటర్ ట్యాంకర్లను గృహా, కమర్షియల్ అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. 

పునరావృతం కాకుండా చర్యలు

నగరంలోని మణికొండ, మాదాపూర్, గచ్చిబౌలి, షేక్‌పేట సహా మరో 25 ప్రాంతాల్లోని ప్రజలు నీటి కోసం బోర్లపై ఆధారపడే వారు. అయితే, ఇటీవల బోర్లు ఎండిపోవడంతో ఈ ప్రాంతాల్లోని ప్రజలు వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. దీంతో అవసరం ఉన్న వారు జలమండలి ద్వారా వాటర్ ట్యాంకర్లను బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే, గత వేసవిలో డిమాండ్‌కు తగ్గ సప్లు చేయలేక అధికారులు సమస్యలను ఎదుర్కున్నారు.

ఈ  ఏప్రిల్ ఆరంభంలోనూ వాటర్ ట్యాం కర్ల సప్లులో ఇబ్బందులు ఎదురయ్యాయి. 24 గంటల్లోపే ట్యాంకర్లను సప్లు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో, జలమండలి ఎండీ సహా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది 584 ట్యాంకర్ల ద్వారా సప్లు చేస్తే ఈ ఏడాది 872 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. గతంలో వేసవి ఆరంభంలో ప్రతిరోజు 10 వేల ట్యాంకుల సప్లు పెండింగ్‌లో ఉండేది. 

బుకింగ్ చేశాక వినియోగదారుడికి చేరడానికి 4, 5 రోజుల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం పెండింగ్ లేకుండా సప్లు చేస్తున్నారు. ౨౦౨౩ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తం 3.04 లక్షల వాటర్ ట్యాంకర్లను సప్లు చేయగా, ఈ ఏడాది మే పూర్తి కాకముందే ౫,౪౮,౫౭౨ లక్షల ట్రిప్పుల వాటర్ ట్యాంకర్లను సరఫరా చేశారు. వీటిలో ఈ ఏప్రిల్‌లో ౨,౩౭,౫౭౦ ట్యాంకర్ ట్రిప్పులు సప్లు చేయడం గమనర్హం.

జలమండలి తీసుకున్న చర్యలు

* ట్యాంకర్ల సంఖ్యను పెంచడం, కొత్త ట్యాంకర్ల కొనుగోలు, అవసవమైతే అద్దెకు తీసుకోవడం లాంటి చర్యలు చేపట్టింది. 

* ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్లను పెంచింది.   

* అదనపు సిబ్బందిని సమకూర్చుకోవడంతో పాటు జీహెచ్‌ఎంసీ నుం చి పలువురు డ్రైవర్లను సమకూర్చుకోవడం జరిగింది.

* ట్యాంకర్ల డెలివరీ, పర్యవేక్షణ కో సం ప్రత్యేకాధికారులను ఏర్పా టు చేసింది. వినియో గదారుల సమస్యలను పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా ‘ట్యాంకర్ మేనేజ్‌మెంట్‌సెల్’ను ఏర్పాటు చేసింది. 

* అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాలను ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేసి వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. 

* ట్యాంకర్ బుకింగ్ మొదలు డెలివరీ వరకు ప్రత్యేక యాప్ ద్వారా ట్రాకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. 

ట్యాంకర్ బుకింగ్, డెలివరీ వివరాలు

క్ర.సం వివరాలు మార్చి1 నాటికి మే17 నాటికి

1 మొత్తం ట్యాంకర్లు 584 872

2 ఫిల్లింగ్ స్టేషన్లు 72 89

3 ఫిల్లింగ్ పాయింట్స్ 120 164

4 రోజువారీ బుకింగ్స్ 3,150 4065

5 రోజువారీ డెలివరీ 4,500 6016

6 ట్రిప్పుల సంఖ్య 1,70,000 1,41,550