19-05-2024 01:48:44 PM
యాదాద్రి భువనగిరి: నల్గొండ -ఖమ్మం -వరంగల్ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయం కోసం అందరం శ్రమించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. భువనగిరి గ్రాడ్యుమేట్ ఓటర్ల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... భువనగిరి బీఆర్ఎస్ నేతలు రాకేశ్ రెడ్డి విజయం కోసం కష్టపడాలన్నారు. శాసనమండలి ఎన్నిక నాలుగు రకాలుగా జరుగుతుందన్న కేటీఆర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులదే కీలక పాత్ర అన్నారు.
పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను కూడా ఓటర్లు పరిశీలించాని పిలుపునిచ్చారు. రాకేశ్ రెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడని తెలిపారు. బిట్స్ పిలానీలో చదివిన ఉన్న విద్యావంతుడు రాకేశ్ రెడ్డి అని కేటీఆర్ అన్నారు. బిట్స్ పిలానీ చదివి అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చాడని వెల్లడించారు. సొంత గడ్డపై ప్రేమతో రాజకీయాల్లో వచ్చాడని కేటీఆర్ పేర్కొన్నారు