11 June, 2026 | 3:30 AM

వివేకవంతుడు మోదీ: ట్రంప్

11-06-2026 02:42 AM

వాషింగ్టన్, జూన్ 10: ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ‘బలమైన, ఆరోగ్య వంతమైన, వివేకవంతుడైన వ్యక్తి’ అని ట్రం ప్ ప్రశంసించారు.

ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ రికార్డును ప్రశంసించిన ట్రంప్, ఆయ న నిరంతర విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచిన నా మిత్రుడు, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యే క అభినందనలు. ఆయన ఒక గొప్ప వ్యక్తి!’ అని ట్రంప్ పేర్కొన్నారు. మోదీ మున్ముందు మరెన్నో గొప్ప విజయాలు, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు.