11 June, 2026 | 3:29 AM

ఏపీ సచివాలయ పనులకు ఆమోదం

11-06-2026 02:40 AM

అమరావతి, జూన్ 10: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండు భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమో దం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో కొత్త గా సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామడేషన్స్ (సీజీజీపీవోఏ) కాంపె క్స్ నిర్మించనున్నారు.

కేంద్ర కార్యాలయాలు ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.  5.53 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంట్రల్ సెక్రటేరియట్ భవన సముదాయాన్ని నిర్మి స్తారు. ఈ అధునాతన భవన సముదాయం లో దాదాపు 8,000 మంది అధికారులు, సిబ్బంది పనిచేయడానికి వీలుగా వసతులు కల్పిస్తున్నారు.

పర్యావరణ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని గ్రీన్ బిల్డింగ్ రూపంలో పనులు చేపడతారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో సీపీడబ్ల్యూడీ ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది. దీనికి సంబంధించిన టెండర్ పనుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.