calender_icon.png 7 December, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సందీప్ కిషన్‌తో స్పెషల్ డ్యాన్స్

07-12-2025 12:31:00 AM

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సిగ్మా’. సుబాస్కరన్ నేతృత్వంలోని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ -అడ్వెంచర్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా,  మగలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిథి పాత్రలు కూడా వున్నాయి.

హీరోయిన్ కేథరీన్ థ్రెసా ఈ చిత్రంలో సందీప్ కిషన్‌తో కలిసి డ్యాన్స్ చేయనుంది. భారీ, కలర్ ఫుల్ సెట్‌లో చిత్రీకరించబడిన ఈ పాటలో సందీప్ కిషన్, కేథరీన్ థ్రెసా హై-ఎనర్జీ తో స్క్రీన్‌ను ఉర్రూతలూగిస్తుందని టీమ్ చెబుతోంది. ఇందుకోసం ఎస్ థమన్ పవర్‌ఫుల్ ట్రాక్‌ను కంపోజ్ చేశారని, ఇది సినిమాకు హైలైట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. తనదైన దారిలో నడిచే ‘సిగ్మా’ అనే మావెరిక్ హీరో చుట్టూ కథ తిరుగుతుంది.

ఇందులో సందీప్ కిషన్‌ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని యాక్షన్ పెర్సోనాలో కనిపించనున్నారు. తమిళం, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ బహు భాషా చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. 2026 వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: కృష్ణన్ వసంత్; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్; ఆర్ట్: బెంజమిన్ ఎం.