ఫుట్‌పాత్ ఆక్రమణపై స్పెషల్ డ్రైవ్
29-05-2026 12:33 AM
మేడ్చల్, మే 28 (విజయ క్రాంతి): మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు గురువారం ఫుట్‌పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సిపి సుమతి ఆదేశాల మేరకు జంక్షన్ లు, వాణిజ్య ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో ఫుట్ పాత్ ఆక్రమణ లను తొలగించారు. 3497 కేసులు నమోదు చేసి సుమారు రూ.6 లక్షల జరిమానా విధించారు. ఫుట్ పాత్ ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






