రైతులకు ఇబ్బందులు కలగొద్దు
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
షాద్‌నగర్, మే 28 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డును అదనపు జిల్లా కలెక్టర్ చంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో సమావేశమై, తడిసిన ధాన్యం విషయంలో రైతులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా చూడాలని ఆదేశిం చారు. అదనంగా, డీఎం సివిల్ సప్లైస్ కా ర్పొరేషన్ జిల్లా పౌర సరఫరాల అధికారి లకు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, వారం రోజుల్లోగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
అలాగే జిల్లా వ్యవసాయ అధికారి కు సన్నరకం ధాన్యాన్ని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లో విక్రయించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యాని కి క్వింటాల్కు రూ.500 బోనస్ అందిస్తు న్నందున, రైతులు ఈ అవకాశాన్ని వినియో గించుకోవాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్,డైరెక్టర్ కరుణాకర్,వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిదారులు పాల్గొన్నారు.






