ట్రాఫిక్ నియంత్రణకు స్పెషల్ డ్రైవ్
11-07-2026 12:00 AM
ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్ జులై 10 ( విజయక్రాంతి) : నిర్మల్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ మయూరి హోటల్, ఈదిగం చౌరస్తా డాక్టర్ లైన్ వివేకనంద చౌరస్తా ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణపై స్పెషల్ ట్రైన్ నిర్వహించారు.
రోళ్ళపై వ్యాపారం చేసే వారిని ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలుపాలన్నారు. ప్రైవేట్ వాహనాలు రోడ్డుపై ఆపితే చర్యలు ఉంటాయి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాస్ సిఐ సమ్మయ్య పట్టణ పోలీసులు పాల్గొన్నారు.






