స్వీపరే టీచరై..
ఇద్దరు ఉపాధ్యాయులు సెలవే
కుబీర్, జులై 10 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని అంతర్నీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వీపర్ గురు చరణ్ టీచర్ అయ్యారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నిత్యం సుభాష్ సాహుపాధ్యాయుడు కత్తి నాగారావు ఒకరి తెలవకుండా ఒకరు సెలవు పెట్టి పాఠశాలకు వెళ్లలేదు. అప్పటికి పాఠశాలకు 18 మంది విద్యార్థులు రాగా సార్లు రాకపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న అటెండర్ పిల్లలకు పాఠాలు చెప్పి మధ్యాహ్నం భోజనాన్ని తినిపించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుల సెలవు ఎంఈఓ కు సమాచారం ఇవ్వగా సెలవు పెట్టిన విషయం తమ దృష్టికి లేదని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలో విధులు నిర్వహించి హెచ్‌ఎం సుభాష్ సార్ పాఠశాలకు తరచుగా సెలవులు పెట్టుకున్నట్టు దీనివల్ల తమ విద్యార్థులు నష్టపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.






