calender_icon.png 17 February, 2026 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరిత వ్యర్థాలపై స్పెషల్ డ్రైవ్

17-02-2026 12:00:00 AM

  1. రెండు రోజుల పాటు ముమ్మర పారిశుధ్య పనులు 
  2. ప్రతి సోమవారం గ్రీన్ వేస్ట్ తొలగింపు
  3. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి):మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలో రోడ్ల పక్కన, కాలనీల్లో పేరుకుపోతున్న హరిత వ్యర్థాలను తొలగించడంపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. చెట్ల కొమ్మలు, ఎండిన ఆకులు, ఇతర గ్రీన్ వేస్ట్ను ఎప్పటికప్పుడు తొలగించేందుకు కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆయన అదనపు కమిషనర్ పారిశుధ్యం, జోనల్ కమిషనర్లు , డిప్యూటీ కమిష నర్లు,అర్బన్ బయోడైవ ర్సిటీ డైరెక్టర్లతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

నగర పరిశుభ్రతకు ఆటంకంగా మారుతున్న హరిత వ్యర్థాలను తొలగించేందుకు తక్షణమే ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశిం చారు. కమిషనర్ ఆదేశాల మేరకు సోమ, మంగళవారాల్లో రెండు రోజులు అన్ని సర్కిళ్ల పరిధిలో ఈ స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగనుంది.  ప్రతి రెండు సర్కిళ్లకు ఒక ఇన్‌చార్జి అదనపు కమిషనర్ సీఎన్ రఘు ప్రసాద్ నియమించారు. వీరు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ, ఎక్కడా చెత్త మిగిలిపోకుండా చర్యలు తీసుకోను న్నారు.

చెట్ల కొమ్మలు నరికేటప్పుడు లేదా తొలగించేటప్పుడు విద్యుత్ తీగలకు తగులుతుంటా యని, దీనివల్ల ప్రమాదాలు జరగకుండా విద్యు త్ శాఖ అధికారులతో సమన్వ యం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ బాధ్యతను యూబీడీ డైరెక్టర్ ఎన్ సునందకు అప్పగించారు. విద్యుత్ శాఖ సహకారంతో అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించి, వెం టనే తరలించేలా చర్యలు తీసుకో వాలని ఆమెను ఆదేశించారు.

ఇది కేవలం తాత్కాలిక చర్య కాదని, ఇకపై నిరంతర ప్రక్రియగా మారాలని కమిషనర్ విన య్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి కార్పొరేషన్ పరిధిలో ప్రతి సోమవారం హరిత వ్య ర్థాల తొలగింపు కోసమే ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.